అర్జీ సమర్పిస్తున్న అర్జీదారుడు
స్పందన అర్జీలు సత్వరమే పరిష్కారం
ప్రజాశక్తి-నెల్లూరు :జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమానికి వచ్చే అర్జీలు సత్వరమే పరిష్కరించాలని, అవి పునరావతం కాకుండా అర్జీదారులు సంతప్తి చెందేలా పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, ఎం హరి నారాయణన్, డిఆర్‌ఒ వెంకట నారాయణమ్మ, జెడ్‌పి సిఇఒ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని, ఫిర్యాదులు పునరావతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినపుడు సకాలంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమంలో వచ్చే ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగతంగా తనిఖీ చేసి సంతప్తికరంగా పరిష్కార మార్గం చూపించాలన్నారు. ప్రతి అర్జీ పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉందన్నారు. అర్జీదారులు కూడా ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు. కార్యక్ర మంలో డిఆర్‌డిఎ, ఐసిడిఎస్ పీడీలు కె. సాంబశివారెడ్డి, హేనా సుజన్, డిఎంహెఒ పెంచలయ్య, డిఎస్‌ఒ వెంకటేశ్వర్లు, డిఇఒ గంగా భవాని, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










