ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందన అర్జీలు పున రావృతం కాకుండా సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులకు సూచిం చారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదిదారులు వారి సమస్యను స్వయంగా జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. ఫిర్యాదిదారులు సమస్యలను కూలంకషంగా విని, వారి అర్జీలను పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమానికి అందే అర్జీలు నిర్ణీత గడువులోపు చట్టపరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. వరకట్నం వేధింపులు, కుటుంబ సమస్యలు, భూవివా దాలు, ఆర్థికపరమైన లావాదేవీల సమస్యలు, ఇతర సమస్యలతో మొత్తం 46 మంది అర్జీదారులు స్పందన ద్వారా వారి సమస్యలను జిల్లా ఎస్పీకి విన్నవించుకు న్నారు. ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, డిసిఆర్‌బి డిఎస్‌పి జి లక్ష్మయ్య, స్పందన సెల్ ఇన్‌స్పెక్టర్ వి మాలకొండయ్య పాల్గొన్నారు.










