Oct 09,2023 20:52

ప్రజలతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరిం చిన అర్జీలపై శ్రద్ధ పెట్టి ప్రజల సంతప్త స్థాయి పెరిగేలా త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసి, డిఆర్‌ఒ సత్యనారాయణలు ప్రజల నుంచి ఫిర్యాదు లను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతప్తిచెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులు, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్‌ లేకుండా అర్జీదారుడు సంతప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.