May 22,2023 19:16

అర్జీలను స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన నిర్వహించారు. డివిజన్‌ స్థాయిలో అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్‌ చేశారు. సోమవారం వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎకి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్‌ రమాదేవి, పౌర సరఫరాల ఉప తహశీల్దార్‌ వలీబాష, ఉప తహశీల్దార్‌ (రీ సర్వే) కౌసర్‌ భాను, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ చేతన్‌ ప్రియా, బీసీ వెల్ఫేర్‌ లక్ష్మీనారాయణ, ఆర్‌టిసి డిఎం మహ్మద్‌ రఫీ, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ రవికుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.