అర్జీలను స్వీకరిస్తున్న అధికారులు
ప్రజాశక్తి - ఆదోని
స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ తహశీల్దార్ రమాదేవి తెలిపారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన నిర్వహించారు. డివిజన్ స్థాయిలో అర్జీలు స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్ చేస్తూ సోమవారం వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యవతి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, వ్యవసాయ శాఖ ఎడి గిరీష్, ఆర్‌టిసి డిపో మేనేజర్ రఫీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ చేతన్ ప్రియ, రీ సర్వే తహశీల్దార్ పెద్దయ్య, అధికారులు పాల్గొన్నారు.










