Feb 20,2023 23:54

అర్జీ దారులతో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌

ప్రజాశక్తి -బాపట్ల జిల్లా : స్పందన అర్జీలను గడువు లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను ప్రభుత్వం విధించిన సమయంలోపు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలపై పదే పదే వచ్చే అర్జీలపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.లక్ష్మి శివజ్యోతి, వ్యవసాయ శాఖ జేడీ అబ్దుల్‌ సత్తార్‌, పశుసంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఎ.చంద్రశేఖర్‌ రెడ్డి, పౌర సరఫరాల శాఖ డిఎస్‌ఎ విలియమ్స్‌,డిఎం శ్రీలక్ష్మి, డిఎం.అండ్‌ హెచ్‌ఒ విజయమ్మ పాల్గొన్నారు.