స్పందన అర్జీలకు తక్షణ పరిష్కారం : ఆర్‌డిఒ
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : స్పందనలో అర్జీలు అందజేసిన అర్జీలను లోతుగా పరిశీలించి త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్‌డిఒ సాదు కరుణకుమారి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్‌డిఒ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని టిడ్కో భవనాలలో రేషన్ మూడు నెలలుగా ఇవ్వడం లేదని దావ పెంచలరావు, చండ్రా వెంకటసుబ్బ నాయుడు, వల్లూరు రమణారెడ్డి, వజ్రమ్మ, తదితరులు ఆర్‌డిఒను కలిసి సమస్యను వివరించారు. సంబంధిత అధికారులను తెలియజేసి సమస్య పరిష్కరిస్తామని ఆర్‌డిఒ తెలియజేశారు. స్వయంగా అర్జీలను బాధితుల గోడు ఆలకించారు. అనంతరం అర్జీదారులను సంబంధించిన శాఖా అధికారులకు పంపి సత్వర పరిష్కారం చేసే విధంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ స్పందనలో 21 అర్జీలు వచ్చాయన్నారు.










