ప్రజాశక్తి-కాకినాడ ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి వారం నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమానికి డిర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి, జెడ్‌పి సిఇఒ ఎ.రమణా రెడ్డి, కెఎస్‌ఇజెడ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, డిపిఒ ఆర్.విక్టర్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను విని, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 374 అర్జీలు వచ్చాయి. ె










