- ఎస్‌పి జి.ఆర్ రాధిక
శ్రీకాకుళం: 'స్పందన' కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కారానికి తొలి ప్రాధన్యత ఇచ్చి నిర్ణీత సమయంలోగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్‌పి రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ మండలాల ప్రజల నుంచి వచ్చిన 36 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. అనంతరం ఫిర్యాదుదారుల నుంచి ముఖాముఖి మాట్లాడారు. ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఫోన్‌లో సంబంధిత అధికారులకు ఫిర్యాదుదారుల వివరాలు, వారి సమస్యలను తెలియపరచారు. ఈ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని ఆదేశించారు. కుటుంబ తగదాలకు సంబంధించినవి ఆరు, పౌర సంబంధాలపై 14, పాతవి మూడు, ఇతరులు 13 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామి పాల్గొన్నారు.
'చలో పొన్నూరు' పోస్టర్










