అల్పాహారం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-బాపట్ల: స్పందనలో అర్జీలు అందజేసేందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు తమవంతు సహాయంగా అల్పాహారం, మంచినీరు అందిస్తున్న ట్లు బాపట్ల మండలం ఆసోదివారిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని యాతం సౌజన్య తెలిపారు. సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో బాపట్ల కలెక్టరేట్ వద్ద 200 మంది అర్జీదారులకు అల్పాహారం, మంచినీరు సౌజన్య సహకారంతో అందించారు. నడవలేని అర్జీదారులకు సౌకర్యంగా ఉండేందుకు రెండు చక్రాల కుర్చీలు సౌజన్య బహూకరించారు. అర్జీలు రాసేందుకు రెడ్‌క్రాస్ కార్యకర్తలు సహకరించారని సౌజన్య తెలిపారు.










