May 23,2023 20:03

విద్యార్థులతో మాట్లాడుతున్న డిఇఒ రంగారెడ్డి

ప్రజాశక్తి - దేవనకొండ
జూన్‌ 2 నుంచి జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని డిఇఒ రంగారెడ్డి తెలిపారు. మంగళవారం దేవనకొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాషినితో ఆయన మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరానికి గాను పదో తరగతిలో 72 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న 36 మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.