భెల్ మెయిన్‌గేటు వద్ద నిరసనలో మాట్లాడుతున్న ప్రకాష్
ప్రజాశక్తి -గాజువాక : భెల్ కార్మికులకు స్పెషల్ ఇన్సెంటివ్‌ను తక్షణమే చెల్లించాలని కోరుతూ భెల్ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం రెండోరోజున నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు ప్రకాష్ మాట్లాడుతూ, కార్మికుల పట్ల యాజమాన్యం పక్షపాత వైఖరి మానుకోవాలని, కార్మికులకు స్పెషల్ ఇన్సెంటివ్‌తోపాటు అన్ని రకాల బకాయిలు, ప్రోత్సాహకాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకుంటే అన్ని కార్మిక యూనియన్లను కలుపుకుని, జెఎసిని ఏర్పాటు చేసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో సనపల జగన్నాధ ావు, జి అచ్చెన్నాయుడు, ఎస్ అప్పారావు, కె విజరుకుమార్ పాల్గొన్నారు.










