ప్రజాశక్తి- దుగ్గిరాల: పంట పండించిన రైతుకు నష్టం లేకుండా అమ్ముకోవడానికి స్పైసెస్ ప్రోసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ ఎండి అమిత్ కుమార్ సింగ్ అన్నారు. మండల కేంద్రం దుగ్గిరాలలోని సెంట్రల్ వేర్ హౌస్‌లో గురువారం ఆయన చేతుల మీదుగా స్పైసెస్ ప్రాసెసింగ్ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేనప్పుడు చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా లాభాలను ఆర్జించవచ్చో తెలిపారు. పసుపు పంటను ఉదాహరణగా తీసుకుంటూ ప్రస్తుతం కింట రూ.5వేలు ఉందని అదే పౌడర్ చేసి అమ్మినట్లయితే రూ.10వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. సెంట్రల్ వేర్ హౌస్‌లో వే బ్రిడ్జ్ సదుపాయం కల్పించాలని వ్యాపారస్తులు తెలిపారు. వడ్లమూడి పెద్దకాకాని వేర్ హౌస్‌లో సరుకు నిల్వ చేస్తే బస్తాకు రూ.9.60 పైసలు వసూలు చేస్తుండగా దుగ్గిరాలలో రూ.14లు వసూలు చేస్తున్నారని వ్యాపారస్తులు ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వేర్ హౌస్ స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ నాథ్ రెడ్డి, రీజనల్ మేనేజర్ అజరు జాడో, వ్యవసాయ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ షేక్ బాజీ , వేర్‌హోస్ మేనేజర్ బి.నిర్మల తదితరులు పాల్గొన్నారు.










