Oct 21,2023 19:44

లలితమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి జయరామ్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
బెల్డోన సొసైటీ మాజీ ఛైర్మన్‌ వైకుంఠం నిరంజన్‌ ప్రసాద్‌ తల్లి లలితమ్మ (80) మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ శనివారం చిప్పగిరిలోని నిరంజన్‌ ప్రసాద్‌ ఇంటికి చేరుకొని లలితమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరంజన్‌ ప్రసాద్‌ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, జడ్‌పిటిసి విరుపాక్షి, వైసిపి కన్వీనర్‌ మారయ్య, చిప్పగిరి సర్పంచి గోవిందరాజులు, వైస్‌ ఎంపిపి నరసింహులు, ధర్మేంద్ర, షేకన్న, రాజన్న, సూరి, పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, మండలంలోని వైసిపి నాయకులు, టిడిపి నాయకులు పాములు, సన్నప్ప, శివలింగ, సంజీవ రాయుడు లలితమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.