కడప : న్యాయవాదుల సంక్షే మం కోసం, వారికి అన్ని విధాలుగా లబ్ది చేకూర్చే విధంగా 'కడప న్యాయ వాదులు మ్యూ చువలీ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కో-ఆపరే టివ్ సొసైటీ' ని సీనియర్ న్యాయవాది, కడప బార్ అసోసియేషన్ ఉపా ధ్యక్షులు పి.ఎస్. బాలసుబ్రమణ్యం నేతత్వంలో ఏర్పాటు చేయడం అభినం దనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా కోర్టులోని కడప బార్ అసోసియేషన్ సమావేశ హాలులో సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. సొసైటీకి సంబంధించి తయారుచేసిన బైలాస్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సొసైటీని బాగా అభివద్ధి చేసి న్యాయవాదులకు అండగా నిలిచి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. సొసైటీ అభివద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి దీనబాబు, మొదటి అదనపు జిల్లా జడ్జి జి. గీత, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి, అడిష నల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్. కవిత, న్యాయమూర్తులు, సొసైటీ చీఫ్ ప్రమోటర్ జి. రామలింగారెడ్డి, కడప బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై. టీ. జె. కెనడి, అసోసియేషన్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.