సోషలిస్టు సమాజం స్థాపనే లక్ష్యం : సిపిఎం
ప్రజాశక్తి - నందికొట్కూరు
పెట్టుబడిదారి వ్యవస్థను కూల్చివేసి సోషలిస్టు సమా జాన్ని స్థాపించడమే సిపిఎం లక్ష్యం అనిమాజీ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు పేర్కొన్నారు. మంగళవారం సిపిఎం కార్యకర్తల సమావేశం కె భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్టుబడుదారి వ్యవస్థకు ప్రత్యామ్నయం సోషలిస్టు సమాజమే ప్రజలకు ప్రత్యామ్నాయమని కారల్ మార్క్స్, ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలిపారు. పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్న దేశాల్లో అధిక ధరల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగిపోయి, నిరుద్యోగ సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. భారత్‌లో కూడా బిజెపి ప్రభుత్వం పెట్టుబడుదారులను పెంచిపోసిస్తోందన్నారు. వీటి మూలంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం, పౌష్టికాహార లోపం రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు పి వెంకటేశ్వర్లు, పి పకీర్ సాహెబ్, ఓబ్లేసు, బేస్తరాజు, శ్రీనివాసులు, సోడా బిబి రంగమ్మ, హుస్నమ్మ, రామకృష్ణ, గోపాల్, నాగన్న, వెంకటేశ్వర్లు, రాము, లింగస్వామి, శివుడు, తదితరులు పాల్గొన్నారు.










