Aug 12,2022 00:30

సోమరాజు కుటుంబానికి పరిహారం అందిస్తున్న సిఐటియు నాయకులు, భవన నిర్మాణ కార్మికులు

ప్రజాశక్తి-గాజువాక : కొనవానిపాలెం గ్రామంలో భవన నిర్మాణ పనులు చేస్తూ జారిపడి ఇటీవల మృతిచెందిన జివిఎంసి 76వ వార్డు పరిధి రామచంద్రనగర్‌ గ్రామానికి చెందిన సోమరాజు కుటుంబానికి గురువారం నష్టపరిహారం అందజేశారు. కార్మిక కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు నాయకులు, తోటి భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేయడంతో భవన యజమాని స్పందించి సోమరాజు కుటుంబానికి రూ.3 లక్షలు అందించారు. ఈ మొత్తాన్ని సిఐటియు, భవన నిర్మాణ కార్మికులు కలిసి మృతుని ఇంటికి వెళ్లి కుటుంబీకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంబాబు, రమణ, అప్పలరాజు, రాముడు, ఈశ్వరరావు, అర్జున్‌, రాజారావు, త్రినాధ్‌, రామ్మూర్తి, గణేష్‌ పాల్గొన్నారు.