గద్వాల సోమన్నను సన్మానిస్తున్న అతిథులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
పెద్దకడబూరు మండలం హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన కొత్త పుస్తకం 'పాలుతేనెలు' బాలగేయాల సంకలనం అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతులమీదుగా కర్నూలులోని టిజివి కళాక్షేత్రంలో ఆదివారం ఆవిష్కరించారు. కవితాగానం అనంతరం బాలసాహిత్యవేత్త సోమన్నను సన్మానించారు.










