Aug 23,2023 19:23

పూజలు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -వెంకటాచలం :ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం రావాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గోలగముడి వెంకయ్య స్వామిని ఆరాధన మహోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన ఆలయాన్ని దర్శించు కున్నారు. ఆయనకు ఆలయ ఇఒ పి.బాలసుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆయనతోపాటు మామిడిపల్లి శ్రీనివాస నాయుడు వెంకటేష్‌ నాయుడు, రాధాకష్ణ నాయుడు, నాగార్జున రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.