ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలోని కొత్తకోడూరు వెంకటేశ్వర మత్స్యకార పట్టపు పాలెం కు చెందిన కొండూరు శ్రీనివాసులు గత 14వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ మతి చెందాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన మత్స్యకార నేత ఆవుల మునిరత్నం నుంచి సమాచారం తెలుసుకొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి వెంట టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసులు, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఊటుకూరు అవినాష్, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్, మాజీ ఎంపీటీసీ బైనబోయిన శ్రీనివాసులు, పామంజి వాసు, పామం జి. శ్రీరాములు, రవి, సూరి, కంజి సాయిరాం, భక్తాన్ని రామాంజనేయులు, చెరుకూరు పరంధామయ్య, దువ్వూరు జానకిరామ్ రెడ్డి,మత్స్యకార నాయకులు ఉన్నారు.










