సీతంపేట: మండలంలోని సోమగండిలో మహాశక్తియాత్ర ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ గ్రామంలో మహాశక్తి ప్రచారకర్త తోయక సంధ్యారాణి ఆ గ్రామ గిరిజనులను కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పంచాయతీ పరిధిలోని సమస్యలను భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పంచాయతీకి కావాల్సిన అన్ని సౌకర్యాలను నెరవేర్చుకోగలమని, నిమ్మక జయకష్ణను గెలిపించుకుటేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిడ్డక చంద్రరావు. ఎంపీటీసీ ఆరిక సువర్ణ వరలక్ష్మి, సవర తిక్కమ్మ, సరోజిని, అప్పలమ్మ, సుండమ్మి, సుందరి. మంగమ్మ, చంద్రమ్మ, మల్లమ్మ, పార్వతి స్థానిక మహిళలు పాల్గొన్నారు.
భామిని : స్థానిక సర్పంచ్ లోపింటి రాజేశ్వరి ఆధ్వర్యంలో టిడిపి మహిళా కార్యకర్తలు ఆదివారం భామినిలో మహాశక్తి యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగుమహిళ మండల అధ్యక్షులు వలురౌతు సంధ్యారాణి మాట్లాడుతూ టిడిపి ప్రకటించిన నూతన మేనిఫెస్టోలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిదిధి దీపం పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారని తెలిపారు. టిడిపితోనే రాష్ట్రంలో మహిళకు గౌరవం, ఆర్థికాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈ సందర్బంగా టిడిపి మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టిడిపిని బలోపేతం చేసి, మనం కలిసికట్టుగా నిమ్మక జయకృష్ణను గెలుపుంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు బిడ్డిక విమల, ముద్దమ్మ, మహిళా ఉపాధ్యక్షులు బర్రి సుస్మిత, మహిళా కార్యదర్శి పడాల విజయలక్ష్మి, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, నాయకులు భూపతి ఆనందరావు, బిడ్డికి ప్రసాద్, లోపింటి రాజేష్, గురిబిల్లి లక్ష్మీ పతి, కోరాడ రాజేష్, లోపింటి చరణ్, అంపిలి కేశవ తదితరులు ఉన్నారు.










