Apr 13,2023 23:57

లైట్లు పంపిణీ చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి -పెదబయలు రూరల్‌:మండలం సీకరి పంచాయతీ చిట్టంరాయి గ్రామంలో గురువారం పెదబయలు పోలీస్‌ స్టేషన్‌, సిఆర్పిఎఫ్‌ 198 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెట్‌ శరణ్యరాజు ఆధ్వర్యంలో సోలార్‌ లైట్లు పంపిణీ చేశారు. జి.మడుగుల సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సత్యనారాయణ 160 మంది గిరిజన కుటుంబాలకు ఉచిత లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుకున్న యువత సంఘ విద్రోహ శక్తుల వైపు వెళ్లకూడదని చెప్పారు.సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీకరి పంచాయతీ సర్పంచ్‌ గుల్లేలి కృష్ణారావు, ఎంపిటిసి వంతల ఆనందరావు, బూత్‌ కన్వీనర్‌ కొర్ర కనకరాజు ు పాల్గొన్నారు.