Mar 24,2023 00:57
పాకెట్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-అద్దంకి: ముస్లింలకు పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా గొట్టిపాటి యూత్‌ ఆధ్వర్యంలో ముద్రించిన రంజాన్‌ మాసం పాకెట్‌ (జేబు) క్యాలెండర్‌ను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ గురువారం చిలకలూరిపేటలోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషిలోని బలహీనతలను, స్వార్థ భావాలను తుడిచిపెట్టి, వాటి స్థానంలో క్రమశిక్షణ, సేవాగుణం, సోదర భావాలను పెంపొందించేదే రంజాన్‌ ఉపవాస దీక్షా మాసమని 'పవిత్ర దివ్య ఖురాన్‌'' గ్రంథం అవతరించిన మాసం రంజాన్‌ మాసం అని తెలిపారు. రేపటి నుంచి నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఉపవాసాలు ప్రారంభించబోయే ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్‌ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాV్‌ా కరుణతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్‌ కరిముల్లా, మైనారిటీ సెల్‌ కార్యదర్శి బాజీ మసూద్‌, అద్దంకి మండల మైనారిటీ సెల్‌ అధ్యక్షులు కరిముల్లా, మీరావలి, రఫీ, ఖాదర్‌ భాషా, ముస్తఫా, పాంటింగ్‌, మూకిటి శివ, నన్నెవలి, మైనారిటీ సెల్‌ నేతలు తదితరులు పాల్గొన్నారు.