Sep 23,2023 21:02

కలశ యాత్రలో పాల్గొన్న అధికారులు, విద్యార్థులు

వాల్మీకిపురం : ఆజాదీకా అమత్‌ మహౌత్సవ్‌ ముగింపు కార్యక్రమం సందర్భంగా కలశ యాత్ర కార్యక్రమాన్ని వాల్మీకిపురం మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం శోభాయామానంగా నిర్వహించారు. కలికిరి ఐటిబిపిఎఫ్‌ 53వ బెటాలిన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల నుంచి సేకరించిన మట్టి, ధాన్యాలను కలశంలో కలిపి పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వాల్మీకిపురంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, జిఎంసి బాలయోగి గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికోన్నత, పివిసి హైస్కూలు, జూనియర్‌ కళాశాల, ఎన్టీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు, ఆలపించిన దేశభక్తి గేయాలు, నత్యాలు అబ్బురపరిచాయి. ఎంపిడిఒ షబ్బీర్‌ అహ్మద్‌ 'ఆజాదీకా అమత్‌ మహోత్సవ్‌' ప్రతిజ్ఞ చేయించారు. గురుకుల పాఠశాల విద్యార్థులు డ్రమ్స్‌ తో నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు , కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు జెండాలు పట్టుకొని దేశభక్తిని చాటుతూ చేసిన నినాదాలు హోరెత్తించాయి. కార్యక్రమంలో ఐటిబిపిఎఫ్‌ కమాండెంట్‌ అమిత్‌ భాటి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌, ఆర్‌బికె చైర్మన్‌ నీళ్ల భాస్కర, వైస్‌ ఎంపిపి డాక్టర్‌ వెంకటరమణ, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ బాషా, ఐటిబిపిఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.వి.రెడ్డి, కష్ణారెడ్డి, ధర్మారావు, వెంకటేష్‌, బాబూలాల్‌, సతీష్‌, మాజీ సైనికోద్యోగులు రవిచంద్ర, మదనమోహన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.