Sep 09,2023 23:48

పిహెచ్‌సికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం శొంఠ్యాంలో రూ.2.40 కోట్లతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదవాడికీ ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో గ్రామగ్రామానా, వార్డుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం సృష్టికర్త జగనన్న అన్నారు. గ్రామాలలో లేవలేని రోగులు వద్దకు వైద్యులు వెళ్లి వైద్య పరీక్షలు చేసి, ఆరోగ్య సూచనలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ గంగునాయుడు, ఎంపిడిఒ లవరాజు, వైసిపి మండల అధ్యక్షులు బంక సత్యనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకట్రావు, వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీను, స్థానిక సర్పంచ్‌ లంక లావణ్య, నాయకులు రాంబాబు, కాకర్లపూడి శ్రీకాంత్‌ రాజు, జి.శ్రీను, బిఆర్‌బి.నాయుడు, బోట్ట రామకృష్ణ, పల్ల దుర్గ, కోరాడ వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.