సొంతింటికల నెరవేర్చడమే లక్ష్యం- రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సంధ్య
ప్రజాశక్తి - మండవల్లి
పేదల సొంతింటి కల నెరవేర్చడమే సిఎంఎ జగన్ లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంట సంధ్య అన్నారు. మండలంలోని కానుకొల్లులో జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను ఆమె శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు రాష్ట్రంలో ఉండకూడదన్నారు. లబ్ధిదారులు త్వరితగతన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి నాగదాసి థామస్, గ్రామ ప్రముఖులు పుట్టి సత్యనారాయణ హౌసింగ్ ఎఇ శేఖర్ పాల్గొన్నారు.
ముదినేపల్లి : జగనన్న ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య అన్నారు. మండలంలోని పెదపాలపర్రులో శనివారం జగనన్న లే ఆవుట్ కాలనీలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ పి.మల్లీశ్వరి, తశశీల్దార్ కె.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఎఇ శ్రీనివాస్, వివిధ శాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.










