Mar 23,2023 23:56

రోడ్డును వేయిస్తున సిహెచ్‌డబ్లు


ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో జోలాపుట్‌ పంచాయతీ తోట గోడిపుట్‌ గ్రామం నుంచి లబ్బురు సిహెచ్‌కి రోగులకు ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే అనేక కష్టాలు ఎదురవడంతో తమ సొంత నిధులతో మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డును జెసిపి సహాయంతో నిర్మాణాన్ని చేపట్టారు. తోటగోడిపుట్‌ గ్రామంలో కనీస రవాణా సౌకర్యం లేకపోవడంతో 3 కిలోమీటర్లు కాలినడకన రోగులను డోలిలతో గర్భిణీలు ఆసుపత్రికి కాలినడకన వెళ్ళవలసిన దుస్థితి నెల కోవడంతో తమ సొంత నిధులతో రోడ్డు వేయాలని నిర్ణయించుకున్నట్లు సిహెచ్‌డబ్లు తెలిపారు. సొంత నిధులు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఆవేదన వ్యక్త పరిచారు. సిహెచ్‌డబ్ల్యుగా విధులు నిర్వహించే ఆమెకు నెలసరి జీతం నాలుగు వేలు. భర్త వ్యవసాయం చేసి సమకూర్చిన డబ్బుతో పాటు ఆమె జీతం కూడా పెట్టి మట్టి రోడ్డును నిర్మాణం చేపట్టారు. గ్రామం నుండి ఆసుపత్రికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు గురవడంతో పాటు రోగులు వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే నిరాకరిస్తున్నారన్న ఉద్దేశంతోనే సొంత నిధులతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.