Jan 11,2023 12:01

ప్రజాశక్త- మైలవరం : స్థానిక వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా బుధవారం సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.బొమ్మల కొలువు, భోగి మంటలు, పొంగల్లు ఏర్పాటు చేశారు. హరిదాసు వేషధారణలో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు  సంక్రాంతి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా బాల బాలికలు వస్త్రధారణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కరస్పాండెంట్ రాజారెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు,విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.