
ప్రజాశక్తి-గుంటూరు: సంగం డెయిరీ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ అరెస్టయ్యారు. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. తెల్లవారుజామున శ్రీనివాసరావుతో సహా మరో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ దాడి ఘటనలో ఇప్పటివరకు ధూళిపాళ్ల నరేంద్ర సహా 15 మందిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.