ప్రజాశక్తి -మధురవాడ : సిపిఐ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ పోతిన సన్యాసిరావు చిరస్మరణీయుడని అఖిలపక్ష నేతలు కొనియాడారు. శుక్రవారం కామ్రేడ్ పోతిన సన్యాసిరావు 38వ వర్ధంతిని పురస్కరించుకుని, మధురవాడ సిపిఐ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. స్థానిక క్వారీ సొసైటీ సిపిఐ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలోఅఖిలపక్ష నేతలు మాట్లాడుతూ, రెండుసార్లు ఎమ్మెల్యేగా మధురవాడ ప్రాంతంలో విద్య,వైద్యం, రహదారుల అభివృద్ధికి సన్యాసిరావు విశేషకృషి చేశారన్నారు. మధురవాడ క్వారీ సొసైటీ నిర్వహించి, వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, క్వారీ అధ్యక్షులు పి అప్పన్న, కార్యదర్శి వి రవికుమార్, పూర్వ అధ్యక్షులు పి రాంబాబు, అఖిలపక్ష నాయకులు చెన్నా దాసు, కె రామారావు పి కృష్ణమూర్తి పాత్రుడు, పి సత్యనారాయణ, నగరాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పి సుజాత, వాండ్రాసి అప్పలరాజు, పి రాంబాబు, పి సూరిబాబు, వి సత్యనారాయణ సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ క్వారీ పాలకవర్గ సభ్యులు సన్యాసిరావు పాల్గొన్నారు.
ములగాడ : మాజీ ఎమ్మెల్యే పోతిన సన్యాసిరావు 38వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో మల్కాపురంలో నిర్వహించారు. కామ్రెడ్ పోతిన సేవలను కొనియాడారు. కార్యర్కమంలో పశ్చిమ నియోజకవర్గ సిపిఐ నేత కాండ్రేగుల సత్యాంజనేయ, విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు, గుడాల రాంబాబు, పోతిన రాము, సత్తిరాజు, నూకరాజు, గండ అప్పారావు, రామకృష్ణ, కనకరాజు, జి జయ, సత్యానందరావు పాల్గొన్నారు.










