
ప్రజాశక్తి - కర్లపాలెం
మండలంలోని ఎంవి రాజుపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేసి, ఇటీవల బదిలీపై నందిరాజుతోట జెడ్‌పి ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఆకురాతి సత్యన్నారాయణ దంపతులను ఉపాధ్యాయులు సోమవారం ఘనంగా సత్కరంచారు. దుశ్శాలువా, పూల దండలతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక బహూకరించారు. ప్రస్తుత హెచ్‌ఎం విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ* సత్యన్నారాయణ ఏడు సంవత్సరాల 8నెలలకుపైగా తమ పాఠశాలకు విశిష్ట సేవలు అందించారని అన్నారు. పాఠశాల అభివృద్ధికి, పిల్లల విద్యాభివృద్ధికి కృషిచేశారని అన్నారు. ఆయన కాలంలో పది ఫలితాలు కూడా బాగా వచ్చాయని అభినందించారు. సత్యన్నారాయణ మాట్లాడుతూ తన పదవీ కాలంలో సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్‌టివి సురేష్, జి శ్రీనివాసరావు, పి నాగేంద్రరెడ్డి, ఎవి ఆదిలక్ష్మి, వి అనూరాధ, నాగలక్ష్మి, పిఇటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.