
ప్రజాశక్తి- నందిగామ : రైతు సంఘాలు ప్రజా సంఘాలు రైతుల సమిష్టి పోరాటం ఫలితంగా అధికార యంత్రాంగం కదలడంతో శనగపాడు సప్లై ఛానల్ ద్వారా నందిగామ, అనాసాగరం గ్రామాల పరిధిలోని చివర భూములకు సాగునీరు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనగపాడు సప్లై ఛానల్ కింద సుమారు 1200 ఎకరాలు పత్తి, మిర్చి, మాగాణి పంట సాగవుతున్నది. గత నెల రోజుల నుండి వర్షాభావం వల్ల పంటలకు సాగునీరు లేక నిలువునా ఎండిపోతున్నాయి. శనగపాడు సప్లై ఛానల్ చెక్ టైం వద్దా? మున్నేరు నుండి మీరు అందకపోవడంతో నందిగామ ఎఎంసి చైర్మన్ మస్తాన్ సొసైటీ చైర్మన్ పాములపాటి రమేష్ స్పందించి ప్రోక్లైన్ ద్వారా చెక్ డాం వద్ద పూడికలు తీయించారు. చెక్ డాం వద్ద ఉన్న బండ రాళ్లు తొలగించి నీరు కిందకి వచ్చేలా చేయడంతో కాలువల ద్వారా నీరు చివర భూములకు చేరాయి. మోటార్ల ద్వారా పత్తి మిర్చి మాగాని పంటలకు సాగునీరు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.