Jun 17,2023 20:35

ఆర్థిక సాయం అందజేస్తున్న స్నేహితులు

ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని కల్లుకుంట గ్రామంలో స్నేహితుని కుటుంబానికి పలువురు స్నేహితులు ఆర్థిక సహాయం అందజేశారు. కల్లుకుంట గ్రామంలో గత పది రోజుల క్రితం ఉప్పర హుస్సేని అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం మృతుని కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సహాయం చేశారు. ముఖ్యఅతిథిగా మాజీ సర్పంచి ఈడిగ సత్యనారాయణ గౌడ్‌, ఎంపిటిసి ఇర్ఫాన్‌ పటేల్‌, వైసిపి నాయకులు, డీలర్‌ నర్సింగప్ప, డీలర్‌ ఉచ్చప్ప, విజరు కుమార్‌, కటిక మహ్మద్‌, జల్లమ్మ గారి తిక్కన్న, బోయ ఈరన్న, ఉప్పర రాము మృతుని కుటుంబానికి తోడుగా ఉంటామని తెలిపారు. రూ.10 వేలను మాజీ సర్పంచి సత్యనారాయణ గౌడ్‌ చేతులమీదుగా హుస్సేని తల్లికి అందజేశారు.