ఆర్థికసాయం అందిస్తున్న మనోహర్ మిత్రులు
ప్రజాశక్తి -తగరపువలస/ పద్మనాభం: రోడ్డు ప్రమాదంలో మరణించిన స్నేహితుడి కుటుంబానికి తోటిమిత్రులు ఆర్థికసాయంతో ఆపన్నహస్తమందించి అండగా నిలిచారు. ఆనందపురం మండలం, లొడగలవానిపాలేనికి చెందిన గుజ్జు మనోహర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతనిి స్నేహితులు జివిఎంసి ఒకటో వార్డు, బంగ్లామెట్టకు చెందిన రెడ్డిపల్లి అప్పలరాజు, వాడపల్లి భాను ప్రసాదరావు, ఎద్దు అప్పలరాజు, ఎం సన్నిబాబు, ఎ.ధనరాజు, ఎన్ పద్మరాజు, పెంటయ్య తదితరులు రూ.40 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆదివారం వీరంతా లొడగలవానిపాలెంలోని మనోహర్ ఇంటికి వెళ్లి, అతని తల్లి, భార్యలకు అర్థికసాయం అందించారు. భవిష్యత్‌లోనూ అన్ని విధాలా అండగా ఉంటామని స్నేహితుడి కుటుంబానికి భరోసా ఇచ్చారు.










