Sep 25,2023 01:14

రూ.40వేల నగదును అందజేస్తున్న గంగాధర్‌, మహేష్‌, ప్రసాద్‌,

ప్రజాశక్తి- కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోటకు చెందిన పలువురు స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. తన స్నేహితుడు పడమటి శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరడం, అదే విధంగా అతడి అమ్మ అనారోగ్యం పాలు కావడంతో అతడి పరిస్థితి దయనీయంగా మారింది. శ్రీనివాసరావు పరిస్థితిని గుడాల గంగాధర్‌ తన సహచర స్నేహితులకు చెప్పడంతో వారంతా తమకు తోచిన విధంగా నగదను సమకూర్చారు. ఈ విధంగా సమకూర్చిన రూ. 40వేలను పడమటి శ్రీనివాసరావుకు ఆదివారం స్నేహితులు అంతా కలిసి అందజేశారు. ఆపదలో ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు అందరికీ గంగాధర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.