Nov 24,2022 21:36

             ఉంగుటూరు :ఉంగుటూరు హైస్కూలులో 2002-2003లో పదో తరగతి చదువుకున్నవారిలో ఒకరైన చల్లా సత్యనారాయణ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి పూర్వ విద్యార్థులు రూ.40 వేలు పోస్టాఫీస్‌లో గురువారం డిపాజిట్‌ చేశారు. సత్యనారాయణ కుమార్తె సాయి పేరున రూ.40 వేలు డిపాజిట్‌ చేసి తల్లి దుర్గకు డిపాజిట్‌ పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు టేకి దుర్గా ప్రసాద్‌, లచ్చిరెడ్డి పవన్‌ కుమార్‌, మైనం సంజన, వానపల్లి సతీష్‌, చైన్‌ గలాష్‌, పురుషోత్తం పాల్గొన్నారు. తొలుత చల్ల సత్యనారాయణ చిత్రపటానికి పూర్వ విద్యార్థులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.