నిజాన్ని వదిలి పారిపోతే
అబద్ధంలోనే జీవించాలి
రోజూ భయపడుతూ ఉంటే
క్షణం క్షణం నరకయాతనలోనే
బలహీనతల్ని వదిలేరు
నిబ్బరంగా నిరాడంబరంగా ఉండు
నాలా అమాయకుడిలా వుండకు
మిత్రులతో చులకనగా నవ్వకు
వేలెత్తి చూపే ముందు
నీలోవున్న లోపమేంటో తెలుసుకో
సమస్యలు మీకు లేవా?
నీ మనసులో నిరంతర పోరాటాలేగా
మరి పరిష్కారమెలా
మనో ధైర్యంగా వుంటే
నీవు భవిష్యత్తుని చూడగలవు
ఆకాశంలో నక్షత్రాల్ని
సముద్రంలో లోతుల్ని
సులువుగా చూసి తెలుసుకున్న నీవు
జీవితం బంగారు బాటకోసం
చిన్న వెలుతురు దారిలో ఎలా పయనించాలో
కొంత అనుభవం ద్వారా
తెలుసుకునే వుంటావు
శ్రమైక సౌందర్యం
ప్రేమైక జీవనం
ధనైకా జీవితం
ఇలా ఎన్నో ఎన్నెన్నో వున్నా
ఇవి కొన్నాళ్ల వరకే
నీ ఉనికిని వెతికి వెతికి పట్టుకుని
నీ దరి చేరే వరకూ వచ్చేది స్నేహమే
ప్రస్తుత స్నేహాలు లాభాపేక్షతోనూ
కుట్రలు కుతంత్రాలతోనూ నిండిన సమాజంలో
నీవు నేను మాట్లాడే తీరు, చేసే పనుల్లో
నిజమైన స్నేహానికి చెడు తెలిసినా
నాలా మౌనంగా వుండి పోవాల్సిందే
నేను స్నేహాన్ని స్నేహితుల్ని వదులుకోలేను
- దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
94930 33543