పుట్టింది ఒక తల్లి గర్భంలో కాదు
పెరిగింది ఒక గూడున కాదు
పలకా బలపం చేతబట్టి
బడిలో ఒంటరినైనప్పుడు
మేమున్నామంటూ
భుజాన చెయ్యేసిన పిల్లలు
ఆడుతూ పాడుతూ..
అక్షరాలను దిద్దాం
పాలునీళ్ళలా కలిశాం
స్నేహ పరిమళాలు పంచాం
పెరిగి పెద్దయ్యాం
బతుకు బాటలో..
దిక్కుదిక్కులా తిరిగాం
ఎక్కడెక్కడో జీవనయానం
అసూయాద్వేషాలు లేవు మాకు
ఆస్తి గొడవలూ లేవు
అందమైన స్నేహబంధం తప్ప
ఆత్మీయుల ఆలింగనం తప్ప
పేరూరు బాలసుబ్రమణ్యం
98492 24162