పల్నాడు జిల్లా: ప్రస్తుత భారతదేశానికి కావలసింది సనాతన ధర్మం కాదని సమానత్వం కావాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నరసరావుపేట పల్నాడు విజ్ఞాన కేం ద్రంలో ఆదివారం జరిగిన చర్చా గోష్టిలో దళిత ప్రజా సం ఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కుల వివక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై బిజెప,ి ఆర్‌ఎస్‌ఎస్ మూకలు సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ పెద్ద ఎత్తున చర్చ చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టా మన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మం భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మించిందని, దళిత ,గిరిజన, బలహీన వర్గాలు, మహిళలకు ఎటువంటి హక్కులు లేకుండా చేసిందని విమర్శించారు. బ్రాహ్మణులు తప్ప మిగతా వారు ఎవరు చదువుకోకూడదని,ఆస్తి లేకుండా హీనమైన వృత్తులు మాత్రమే చేస్తూ, పైవారికి సేవలు చేస్తూ బతకాలనే భావజాలాన్ని ప్రజల మెదళ్లకు ఎక్కిం చిందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని ప్రాచీన కాలం నుండి వివిధ కాలాలలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సనాతన ధర్మానికి ప్రామాణికమైన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి తీవ్రంగా వ్యతిరేకించటం జరిగిందని తెలిపారు. మనుధర్మ శాస్త్రం ఎవరికైతే హక్కులు లేకుండా చేసిందో వారికి అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు.
ప్రజలందరూ సమానమే అని సూక్తికరించి సమానత్వం సాధించడానికి పాలకులు ఏమి చేయాలో రాజ్యాంగం లో పొందుపరిచారని చెప్పారు. అటువంటి రాజ్యాంగాన్ని నాశనం చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలోని బిజెపి మూకలు కుట్రపన్నుతూ ప్రజల్లో భావావేశాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్,బిజెపి మూకల కుట్రలో పడిన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ ,బిజెపి మూకల విషపు కౌగిలి నుండి ప్రజానీకాన్ని కాపాడటం కోసం, ప్రజలను చైతన్య పరచడం కోసం ప్రజా స్వామిక వాదులు, అభ్యుదయవాదులు కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
చర్చా గోష్టిలో జై భీమ్ భారత్ పార్టీ జిల్లా సమన్వయకర్త గోదా జాన్ పాల్, దళిత గిరిజన బడ్జెట్ వాచ్ జిల్లా కన్వీనర్ మల్లెల చిన్నప్ప, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై రాధాకష్ణ,విసికె పార్టీ జిల్లా అధ్యక్షులు సూరె వీరయ్య, రైతు సంఘం నాయకులు ఏపూరి గోపాలరావు, కౌలురైతు సంఘం నాయకులు కామినేని రామారావు, కోండ్రు ఆంజనేయులు, సిఐటియు నాయకులు షేక్ సిలార్, ఆవాజ్ నాయకులు షేక్ మస్తాన్ వలి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) జిల్లా నాయ కులు మేడం ఆంజనేయులు,మాల మహానాడు నరస రావుపేట యూత్ నాయకులు చావా సామేలు తదితరులు పాల్గొన్నారు.










