వేంపల్లె : ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన వారం దరికి మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.విజరు రామరాజు అన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలోని సభా భవనంలో జగ నన్నకు చెబుతాం అనే మండల స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ వి.విజరురామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రాల్గోన్నారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు నుండి దరఖాస్తులను కలెక్టర్ వి.విజరు రామరాజు స్వీకరించి క్రింది స్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలు మంజూరుతో పాటు డికెటి పట్టాలకు రిజిస్టర్ పట్టాగా ఇచ్చేందుకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అర్జీదారులకు పారదర్శకంగా, సంతప్త స్థాయిలో నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులకు సూచించారు. స్థానిక సమస్యలు సచివాలయ పరిధిలోనే పరిష్కారం కావాలన్నారు. జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించే దిశగా మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పభుత్వం అత్యంత ప్రధా న్యతతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దష్టి సారించా లన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల అర్జీలకు అధికారులు అందించే పరిష్కార నివేదికలు స్పష్టంగా ఉండాలని, ఏ ఒక్క అధికారి తాత్సారం గాని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సమస్యలను నేరుగా సంబందిత అధికారులే పరిష్కరిస్తారని స్థానిక ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటి స్థలం లేని నిజమైన లబ్ధిదారులు అందరికి ఇంటి స్థలాలను మంజూరు చేస్తామని అయితే స్థలం మంజూరు అయిన లబ్ధిదారులు మాత్రం ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరారు. హౌసింగ్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడ లబ్ధిదారులకు సకాలంలో మంజూరు అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు ఎస్టీ, ఎస్సీ మానిటరింగ్ కమిటీ సభ్యులు నాగన్న కలెక్టర్‌ను కలిసి ఎస్సీ రైతులకు ఇచ్చిన డికెటి భూములను రిజిస్టర్ భూములుగా మార్చాలని కోరారు. ఎగువ తూపల్లె ఎస్సీ కాలనీ నుండి వైఎస్‌ఆర్ ప్లాంట్ వరకు రోడ్డు వెడల్పు చేయాలని అలిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ నాగ సుబ్బారెడ్డి కోరారు. అమ్మగారిపల్లె శ్మశాన వాటికి వరకు సిసి రోడ్డు వేయాలని వైసిపి నాయకుడు రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్‌కు దరఖాస్తులు అందించారు. వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం కోసం 20 ఎకరాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ను జడ్‌పిటిసి రవికుమార్‌రెడ్డి, ఎంపిపి లక్ష్మి గాయత్రీ, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి కోరడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. రేషన్ బియ్యం తక్కువగా వస్తున్నాయని కోటా పెంచాలని ఎంపిటిసి భారతి జాయింట్ కలెక్టర్‌ను కోరారు. శ్రీరాంసాగర్ కాలనీలో తాగునీటి సమస్య ఉందని మహిళాలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా త్రాగునీటిని సరఫరా చేసేం దుకు ట్యాంకులు నిర్మాణం జరుగుతున్నదని వచ్చే జూన్ నాటికి త్రాగునీటిని ఇబ్బందులు తొలగి పోతాయని మహిళాలకు కలెక్టర్ చెప్పారు. ప్రతి ఇంటికి కూడ తాగునీటిని సరఫరా చేస్తామని హమీ ఇచ్చారు. అనంతరం ఎంపిడిఓ కార్యాల యం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సభా భవనంను కలెక్టర్ వి.విజరు రామరాజు తనీఖీ చేసి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి రవికుమార్‌రెడ్డి, ఎంపిపి లక్ష్మి గాయత్రీ, ఎపిఐఐసి డైరెక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, పులివెందుల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యష్య, జడ్పీ సిఇఒసుధాకర్ రెడ్డి, డ్వామా పీడీ యాధుభూషణన్ రెడ్డి, డిఇఒ రాఘవరెడ్డి, ఎస్‌ఎస్‌ఎ పిఒ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్ చంద్ర శేఖర్‌రెడ్డి, ఎంపిడిఒ మల్లికార్జునరెడ్డి, పిఆర్ డిఇ రవిచంద్రరెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఇఇ సిద్దారెడ్డి, హౌసింగ్ ఎఇ సుకుమార్‌రెడ్డి, ఎంపిటిసిలు కటిక చంద్రశేఖర్, వార్డు మెంబర్లుతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.