కరపత్రాలు పంచుతున్న వ్యకాస నాయకులు
ప్రజాశక్తి-సంతమాగులూరు: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. గురువారం సంతమాగులూరులో పలువురు పట్టభద్రులను, స్కీం వర్కర్లు, ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులను కలుసుకొని, ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి, పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు వల్ల ఆమోదయోగ్యమైన, గౌరవప్రదంగా సమాజానికి జవాబుదారీగా ఉంటుందని తంగిరాల తెలిపారు.










