May 17,2023 23:54
గౌరవ వందన స్వీకరిస్తున్న బాపట్ల డిఎస్పి

ప్రజాశక్తి-సంతమాగులూరు: పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుగా మెలగాలని బాపట్ల డిఎస్పి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నాడు ఆయన సంతమాగులు పోలీస్‌ స్టేషన్‌ను మొట్టమొదటిగా సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ శివకుమార్‌, సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, పలు రికార్డ్స్‌, సిబ్బంది నడవడికను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది అందరూ ఐకమత్యంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా పోలీసులు పాల్గొన్నారు.