సంతప్త స్థాయిలోప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలి - కలెక్టర్ వి.విజరు రామరాజు
కడప : జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అంది ంచడంతో పాటు ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు సంతప్తి కరమైన పరిష్కారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వి.విజరు రామరాజు జిల్లా అధికారులను ఆదేశించారు. గురు వారం అమరావతి నుంచి భూ రీ సర్వే, జాతీయ రహదారుల లాండ్ అక్వైజేషన్, ఈ క్రాప్ బుకింగ్స్, ఖరీఫ్ పంటలు, రైతుల రుణాలు, ప్రాధాన్యత భవనాలు, జల్ జీవన్ మిషన్, జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపె రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షిం చారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ వి.విజరు రామరాజు తోపాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్‌ఒ గంగాధర గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సిఎస్ విసి ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సూచనలు, ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సంతప్తి స్థాయిలో అందాలని, ప్రజల నుండి అందే స్పందన అర్జీలకు వేగవ ంతంగా, సంతప్తి కరంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లాలో భూ రీ సర్వే ఫేస్ -1 కింద 86 గ్రామాల్లో ఫేస్ -2 కింద 99 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేశామన్నారు. భూ రీ సర్వే ఫేస్-3 కింద 100 గ్రామాల్లో ఎక్కడ పెండింగ్ లేకుండా, గ్రౌండ్ ట్రూతీంగ్, గ్రౌండ్ వాలిడేషన్ చేసి, స్టోన్ ప్లాంటేషన్ పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ క్రాప్ 100 శాతం పూర్తి చేశామని, ఇకెవైసి 98 శాతంతో రాష్ట్రం లోనే వైఎస్సార్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ గోడౌన్స్ త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బికె, హెల్త్ క్లినిక్ లు స్టేజ్ కన్వర్షన్ మీద ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. అన్ని అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులందరూ కషి చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీయదు భూషణ్ రెడ్డి, డిపిఒ ప్రభాకర్ రెడ్డి, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద్ నాయక్, సర్వే ఏడి మురళీ కష్ణ, డిసిఒ సుభాషిణి, అర్‌డబ్లూఎస్ ఈరన్న, వ్యవసాయ శాఖ జెడి నాగేశ్వరరావు, సిపిఒ వెంకటరావు, అనిమల్ హస్బెండరీ శాఖ అధికారిని శారదమ్మ, పిఆర్ ఎస్‌ఇ శ్రీనివాసులురెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.










