Aug 06,2023 21:35

మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

కడప : సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆదివారం కడప జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాయలసీమలోని కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. పిసిసి అధ్యక్షునితోపాటూ మీడియా సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ ఎన్‌. తులసిరెడ్డి, ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ హాజరయ్యారు. ముందుగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని సంసా ్థగతంగా నిర్మించేందుకు కో-ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయిలో నిర్మాణం చేయడంతో పాటు 35 నియోజకవర్గాలకు కన్వీనర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గట్టిపోటీ ఇవ్వనుందన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి తొత్తులుగా మారాయని విమ ర్శించారు. రా యలసీమ జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాట్లా డుతూ ఎన్నికలకు కాంగ్రెస్‌ శ్రేణుల్ని చైతన్య పరచ డమే లక్ష్యంగా ముం దడుగు వేస్తున్నామని రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే రాష్ట్రానికి ప్రత్యామ్నాయమని జగన్‌ బాబు పవ న్లు మోడీని బలపరచడం సిగ్గుచేటని తెలిపారు. మీడియా సెల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రానికి సాగునీటి రంగం గుండెకాయ లాంటిదని ఈ రంగాన్ని వైసిపి, టిడిపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం దురదష్టకరమని పోలవరానికి బిజెపి ఒక శని గ్రహం, వైసిపి, టిడిపి రాహు కేతువులు అని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభు త్వాలు సాగునీటి రంగానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవని మొత్తం వార్షిక బడ్జెట్లో 15శాతం నిధులు సాగునీటి రంగానికి కేటాయించాయని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే శ్రీశైలం రిజర్వాయర్‌, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజీ, ధవలేశ్వరం బ్యారేజీలు, నిర్మించబడ్డాయని తద్వారా ఆంధ్రప్రదేశ్‌ అన్న పూర్ణగా పేరుగాంచిందన్నారు. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, పులిచింతల ప్రాజెక్టులలో సింహభాగం హ క్కులు కాంగ్రెస్‌ పాలనలో పూర్తి అయ్యాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి, రాష్ట్ర నా యకులు బండి జకరయ్య, నజీర్‌ అహ్మద్‌, గుండ్లకుంట శ్రీరాములు, బొజ్జా తిరు మలేష్‌, లీలా శ్రీనివాస్‌, ప్రసాద్‌ గౌడ్‌, శ్యామలాదేవి, పూల భాస్కర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, రాష్ట్ర జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన రెడ్డిసాహెబ్‌
మదనపల్లె అర్బన్‌ : కడప నగరంలో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ కన్వీనర్ల సమావేశానికి పీలేరు నియోజకవర్గ కన్వీనర్‌ ఎస్‌.రెడ్డీ సాహెబ్‌, మదనపల్లి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సురేంద్ర రెడ్డి, మహబూబ్‌ పీర్‌, జీవన్‌ కుమార్‌ హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌.రెడ్డి సాహెబ్‌ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై పిసిసి అధ్యక్షులు దిశానిర్దేశం చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లాలని, కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఆవశ్యకత గురించి తెలియజేశారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పూర్వవైభవానికి శక్తి వంచన లేకుండా కషి చేయాలని సూచించినట్లు తెలిపారు.