Oct 24,2023 20:38


దాండియా నృత్యం చేసిన ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. పట్టణ మార్వాడి సమాజ్‌ వారి ఆధ్వర్యంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమానికి గ్రంధి శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావితరాలకు మన సంస్కృతీ, సంప్రదాయాలను తెలియజేసే విధంగా మార్వాడీలు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా మార్వాడీ సమాజ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మార్వాడీ సమాజ సభ్యులతో కలిసి రాజస్థానీ సాంప్రదాయమైన దాండియా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పేరిచర్ల విజయ నరసింహరాజు, వైసిపి పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, జైన్‌ యూత్‌ సంఘం నాయకులు హష్ముక్‌ లాల్‌ జైన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవన్‌ నుంచి ప్రారంభమైన ఊరేగింపు ప్రకాశం చౌక్‌, వెంకట రామ థియేటర్‌, తహశీల్దార్‌ కార్యాలయం, పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‌, మావుళ్లమ్మ గుడి వీధి మీదుగా సాగింది.