ప్రజాశక్తి - పరవాడ
సంస్కృతి గ్లోబల్ స్కూల్‌లో కిండర్ గార్డెన్ చిన్నారుల పట్టభద్రుల వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక విద్యకు అర్హత సాధించన పలువురు చిన్నారులకు పట్టాలు అందజేశారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రాండెక్స్ జనరల్ మేనేజర్ రాబర్ట్ పి.ఫర్గుసన్ మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు పిల్లల్లో దాగి ఉన్న మృదువైన నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తకం జ్ఞానం పొందిన విద్యార్థులు కంటే మృదు నైపుణ్యం గల వారు ఎక్కువగా రాణిస్తున్నారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ మార్పును అంగీకారించి మార్కుల ముసుగు ధోరణికి స్వస్తి పలకాలని హితావు పలికారు. పాఠశాల డైరెక్టర్ పి.ఉదయ నాగశ్రీ మాట్లాడుతూ చిన్నారుల తరగతి గది తన ఛాంబర్‌కు దగ్గరగా ఉండడంతో వాళ్లు చేసే శబ్దాలు తియ్యని వేణుగానంలా అనిపిస్తున్నాయని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.సీతాలక్ష్మి మాట్లాడుతూ కిండర్ గార్డెన్ చిన్నారులు ఆట పాటలతో నేర్చుకున్న విద్య వారి ప్రాథమిక విద్యకు తోడ్పాడాలని ఆకాంక్షంచారు. చిన్నారులు చేసిన పలు నృత్యప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మోనాలిసా, అరుణ, లీసా, మహిమ, రామాన్ కౌర్, నిశాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










