Sep 26,2023 21:22

సంస్కరణలో భాగంగానే జిపిఎస్‌ అమలు -ఆ మూడు పార్టీలు బిజెపిని మోస్తున్నాయి

కడప అర్బన్‌ : ఐఎంఎఫ్‌ నిర్దేశిత పెన్షన్‌ సంస్కరణలో భాగంగానే జిపిఎస్‌ అని, అంగన్వాడీలకు బిఆర్‌ఎస్‌ ఇస్తున్న వేతనం రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇవ్వాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ అధ్య క్షతన జిల్లాలోని వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం మంగ ళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్‌, సిపిఐ (ఎం.ఎల్‌.) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ.రాము, సిపిఐ. (ఎంఎల్‌) లేబరేషన్‌ జిల్లా కార్యదర్శి రమణయ్య, ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా కార్యదర్శి జయవర్ధన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఉపా ధ్యాయులు జిపిఎస్‌. రద్దు, ఓపిఎస్‌. సాధన కోసం చేపట్టిన శాంతియుత 'ఛలో కలెక్టరేట్ల' కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం భగం చేయటానికి పోలీసులను ఉపయోగించిందని విమర్శి ంచారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను గహనిర్బంధం చేయటం, ఉపాధ్యాయ కార్యాలయాలకు ముందు పోలీసులను మోహరించటం, పౌర హక్కులను కాలరాసి, రాజ్యాంగ ఉల్లంఘన చేయడమేనని ఆరోపించారు. సోమవారం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఐక్య కార్యచరణ కూటమి పిలుపు మేరకు వైసిపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయల అదనంగా ఆంధ్రప్రదేశ్‌ మాట్లాడుతున్న వామపక్ష నాయకులుఅంగన్వాడీలకు జీతభత్యాలు పెంచుతామని హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ''చలో విజయవాడ'' పిలుపును భగం చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులను అంగన్వాడీలపై ఉసికొల్పి అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు ప్రయోగించటం చట్ట విరుద్ధమని తెలిపారు. అప్రజాస్వామిక చర్య అన్నారు. అంగన్వాడీలపై పురుష పోలీసులను ప్రయోగించటం 'పోలీస్‌ కాండక్ట్‌ రూల్స్‌ ప్రొసీడింగ్స్‌'కు విరుద్ధమని వీటిపై న్యాయస్థానాలు 'సుయో మోటో'గా కేసులు నమోదు చేసి పోలీసులను విచారించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన కేంద్రంలోని బిజెపి అప్రజాస్వామిక విధానాలను మోస్తున్నాయని చెప్పారు. స్వతంత్ర కార్యచరణ లేదని వారు ఎద్దేవా చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, నిత్యావసర వస్తువులు అధిక పెంపు, ప్రజలు మోయలేని పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలనను నిరసిస్తూ, అధికార పార్టీ ధనార్జన ముఠాలు రియల్‌ ఎస్టేట్‌ రియల్‌టర్లు కలెక్టర్‌ సంతకాలనే ఫోర్జరీ చేస్తూ, ప్రభుత్వ భూములను బాహటంగా కబ్జాలకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 27న 'వామపక్ష పార్టీల ఉమ్మడి ఛలో కలెక్టరేట్‌ ధర్నాల' ను జయప్రదం చేయాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఓబులేసు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు బాదుల్లా, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి.ఆర్‌.వి. ప్రసాద్‌ పాల్గొన్నారు.