ప్రజాశక్తి - చిలమత్తూరు : వైఎస్సార్ సంపూర్ణ పోషణతో తల్లిబిడ్ద ఆరోగ్యంగా ఉంటారని వైసిపి హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ దీపిక అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్బీకేలో నిర్వహించిన టేక్ హోం రేషన్ కార్యక్రమాన్ని దీపక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్ ఘనీ, ఎంపిపి పురుషోత్తమ రెడ్డి, ఎంపిడిఒ నరేంద్ర క్రిష్ణ, సర్పంచి సంధ్య, తిరుమలేష్, మురళీ, ఎంపిటీసి రాఘవేంద్ర నాయకులు రామక్రిష్ణా రెడ్డి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : స్థానిక పూలకుంటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహార కిట్లను వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపిక పంపిణీ చేశారు. అదేవిధంగా తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని, ఎంపీడీఓ నరేష్, సిడిపిఒ రెడ్డి రమణమ్మ, చిన్నపిల్లల డాక్టర్ కేశవులు, సివిల్ సప్లై డీటీ హారతి, నక్కలపల్లి శ్రీరామ్ రెడ్డి, సిపిసి సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : మండలంలోని పెద్దకోడిపల్లి, తురకలాపట్నం గ్రామాలోలని అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకు, బాలింతలకు ఇంటికే రేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ రొద్దం సర్పంచు రూప, తహశీల్దార్ ఆనంతాచారి, ఎంపీడీవో రాబర్ట్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లలో బుధవారం వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గంగాదేవి నరసింహమూర్తి, ఉప సర్పంచి వేణుగోపాల్, ఎంపీటీసీ ఈశ్వరయ్య, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఈవోఆర్డీ నాగరాజు రావ్ తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ బగ్గిరి త్రివేణి, జెడ్పీటీసీ కోటి సుధ అన్నారు. బుధవారం స్థానిక భారతి మండల సమాఖ్య కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం. ' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ సరస్వతి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా ఎంపీపీ, జెడ్పీటీసీతో పాటు ఎంపీడీఓ కార్యాలయ సూపరెండెంట్ శ్రీదేవి, సీహెచ్ రాజశేఖర్ పాల్గొన్నారు.
కొత్తచెరువు : ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న సంపూర్ణ పౌష్టికాహారాన్ని గర్బిణులు, బాలింతలు. చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ పీడీ లక్ష్మి కుమారి తెలిపారు కొత్త చెరువులోనే నామగుండ్ల వీధిలో గల అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆమె పౌష్టికాహార ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి రాధా, జెడ్పీటీసీ గంగాదేవి, సిడిపిఒ గాయత్రి, సూపర్వైజర్ పుష్పలత, అంగన్వాడీ టీచర్లు రాధా, ఉమాదేవి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
పరిగి : రక్తహీనత పోషకాహారం లోపం లేని పిల్లల ఎదుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తహశీల్దార్ సౌజన్యలక్ష్మి వెల్లడించారు.బుధవారం పరిగి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వరూప రెడ్డి, సర్పంచి లక్ష్మీదేవి శివశంకర్, ఎంపిటిసి లింగమ్మ, సూపర్వైజర్ సుశీలమ్మ, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట : మండల పరిధిలోని చామాలగొంది, సోమయాజులపల్లి, మల్ల మీద పల్లి, కోటూరు. తదితర గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లలో గర్భిణులకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతి, కార్యకర్తలు లక్ష్మీదేవి, ఈశ్వరమ్మ, మండల ఆర్బికే చైర్మన్ వైవి శంకర నాయుడు, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
బత్తలపల్లి : స్థానిక ఐసీడీఎస్. కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను సీడీపీవో సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అంతకు ముందు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో పద్యావతి, సూపర్ వైజర్లు చంద్రమ్మ, దేవమణి, లలితమ్మ, రోఆర్డినేటర్ ములమ్మ, అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
నల్ల చెరువు : మండల కేంద్రంలోని1,వ సచివాలయం పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎంపిపి రమణారెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శకుంతల, తహశీల్దార్ రవికుమార్ చేతుల మీదుగా గర్భిణులకు పోషకాహారకిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందితో పాటు వైస్ ఎంపీపీ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : బాలింతలకు, గర్భిణీలకు నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే పౌష్టిక ఆహారం అనే పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాళ్లపల్లి సర్పంచి లక్ష్మీనారాయణ సూచించారు. మండల పరిధిలోని కల్లురొప్పం గ్రామంలోనిఅంగన్వాడి 1 ,2, వ సెంటర్లలో బుధవారం తల్లి పాల వారోత్సవాలతోపాటు నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే పౌష్టిక ఆహారం పథకం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ద్రాక్షాయని, రాధిక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, డీలర్ తిమ్మా గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల : వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు పాలు కోడిగుడ్లు రైసు నూనె పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిపిఒ విజరు కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచి సరోజ, ఎంపీడీవో రఘునాథ్ గుప్తా, మండల అగ్రిఛైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ నరసింహారెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్ నాగరాణి పంచాయతీ ఈవో బాబురావు తదితరులు పాల్గొన్నారు
రొళ్ల : మండలంలోని వెలుగు కార్యాలయం నందు బుధవారం అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు కూరగాయల ప్రదర్శన చేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సన్నమ్మ, తహశీల్దార్ భాగ్యలక్ష్మి, సర్పంచి రామలక్ష్మమ్మ, వెలుగు ఎపిఎం, మహిళా పోలీసులు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










