పాచిపెంట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు రక్తహీనత సమస్య తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద గురువారం వైయస్సార్ సంపూర్ణ పోషణ టేక్ హౌమ్ రేషన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన గర్భిణీలకు, బాలింతలకు టేక్ హౌమ్ రేషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహారలేమి సమస్య వల్ల రక్తహీనతకు గురై వ్యాధి నిరోధక శక్తి తగ్గి మృత్యువాత పడుతున్నారని, ఇకపై గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో వైయస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్, టేక్ హౌమ్ రేషన్ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిడిపిఒ బి.అనంతలక్ష్మి, ఎంపిడిఒ జి.పార్వతి, వైస్ ఎంపిపి మీసాల నారాయణ, ఎంఇఒ జోగారావు, సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: మండలంలోని బుక్కురు 1, 2 అంగన్వాడి కేంద్రాల్లో సర్పంచ్ బి.కొండలరావు చేతులు మీదుగా గర్భిణి, బాలింతలకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎచ్ పి.కమలాజోషీ, టి.దివ్య, హిమాప్రభ గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : గర్భిణులు, బాలింతలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ తాడికొండ సెక్టార్ సూపర్‌వైజర్ శ్రీదేవి తెలిపారు. కొండవాడ పంచాయతీ వత్తాడలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సంపూర్ణ పోషణ కిట్లను అందించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలను నిర్వహించారు.
కురుపాం : స్థానిక మండల కేంద్రంలో గల అంగన్వాడీ కేంద్రం -3 లో జరిగినటేక్ హౌమ్ రేషన్ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపిపి శెట్టి పద్మావతి వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను గర్భిణీలకు, బాలింతలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ వి.వి. రవణమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు జె.సరోజ, సూర్యకుమారి, శోభ, రాధా కుమారి సరస్వతి పాల్గొన్నారు.










