ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లిలో సంపద తయారీ కేంద్రం నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి సూచించారు. షెడ్డు నిర్మాణం పనులను ఆమె శుక్రవారం పరిశీలించారు. నిర్మాణం పనుల పై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో నక్కపల్లి, కశింకోట, సబ్బవరంలో ఏర్పాటు చేస్తున్న సంపద తయారీ కేంద్రాలను శిక్షణ కేంద్రాలుగా మార్చి చెత్త నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 8 మండలాలకు సంబంధించి చెత్త నిర్వహణపై ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.శిక్షణపై అవగాహన కోసం విజయవాడలో జరిగే తరగతులకు హాజరుకా వాలని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌కు సూచిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, ఎంపీడీవో సీతారామరాజు, ఈఓపిఆర్డి వెంకట నారాయణ, పంచాయతీ ఉపసర్పంచ్ వీసం రాజు పాల్గొన్నారు.










